![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ గోదావరి Godhavari . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 88 లో..... కిన్నెర స్కూల్ లో కిందపడిపోయిందని తనని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. డాక్టర్ వచ్చి తనకి హార్ట్ లో హోల్స్ ఉన్నాయని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. మీరు ఇరవై అయిదు లక్షలు ఏర్పాటు చేసుకోండి.. ఆపరేషన్ చేయాలి.. లేదంటే పాపకి డేంజర్ అని డాక్టర్ చెప్తుంది. దాంతో అందరు కంగారుపడుతారు. కిన్నెర దగ్గరికి అందరు వెళ్తారు. అమ్మ నాకు ఏమైందని కిన్నెర అడుగుతుంది. ఏం లేదు నువ్వు అన్నం తినమంటే తినవు కదా అందుకే ఇలా జరిగిందని మురళి చెప్తాడు.
అమ్మ నాకు ఎందుకో నాన్న గుర్తువస్తున్నాడని కిన్నెర అంటుంటే తనని పట్టుకొని శారద ఏడుస్తుంది. ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడాలని అందరు టెన్షన్ పడుతారు. అప్పుడే జానుకి సూర్య ఫోన్ చేస్తాడు. దాంతో జానూ ఫోన్ పగులగొడుతుంది. కిన్నెరని పట్టుకొని జానూ ఏడుస్తుంది. రేపు శుక్రవారం నందుతో వరలక్ష్మి వ్రతం జరిపిద్దామనుకున్నామని పెద్దవిడ అంటుంది. రేపు వ్రతం జరుగుతుంది దానికి కావలసిన ఏర్పాట్లు చూడండి అని జాను చెప్తుంది.
ఆ తర్వాత మురళికి సూర్య ఫోన్ చేసి ఒకసారి జానూని బయటకు రమ్మని చెప్పు అంటాడు. ఆగు నేను వస్తున్నా అని మురళి బయటకు వస్తాడు. తన వెనకాలే జాను వస్తుంది. బావ వాళ్ళతో నీకు మాటలేంటి లోపలకిరా అని జాను అంటుంది. జాను నేను చెప్పేది విను. ఎంగేజ్మెంట్ నాకు ఇష్టం లేకుండా జరిగిందని సూర్య అనగానే ఏంటి నీకు ఎంగేజ్మెంట్ జరిగిందా అని మురళి తన కాలర్ పట్టుకొని జానుని ఇంత మోసం చేస్తావా అని అడుగుతాడు. మురళి నేను చెప్పేది విను అని సూర్య రిక్వెస్ట్ చేస్తాడు. అదంతా భువన సింహాద్రి దూరం నుంచి చూస్తారు. తరువాయి భాగంలో నందు కోసం మురళి చీర తీసుకొని వస్తాడు. అది చూసి నచ్చలేదని మురళి మొహంపై విసిరేస్తుంది నందు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |